రిపబ్లికన్ పార్టీ నుంచి అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీపడుతోన్న భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామి (vivek ramaswamy) దూకుడుగా ముందుకెళుతున్నారు. గడచిన ఆరు రోజుల్లోనే ఆయన 42 ప్రచార సభలు నిర్వహించారు. వచ్చే వారం మరో 38 సభలు నిర్వహించనున్నారు. మిగిలిన వారితో పోల్చుకుంటే రామస్వామి వేగంగా దూసుకెళుతున్నారు. ప్రజల నుంచి వస్తున్న ప్రోత్సాహంతోనే తాను ఇన్ని సభలు పెట్టగలిగినట్లు వివేక్ రామస్వామి వెల్లడించారు.
నా ప్రచార సభలకు హాజరవుతున్న జనాన్ని చూస్తుంటే…ఎంతో శక్తి వస్తోంది. దేశం పట్ల వారికున్న శ్రద్ధే నన్ను ప్రోత్సహిస్తోంది.సామాజిక మాధ్యమాలు, టీవీలతో కూడా
ఇంతటి ప్రచారం సాధ్యం కాదని రామస్వామి అభిప్రాయపడ్డారు.
అమెరికా ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం రిపబ్లికన్ పార్టీ తరపున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, సహా మరో ఐదుగురు పోటీపడుతున్నారు. వారిలో భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామి ఒకరు.