ఎన్ఐఏ నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు చెందిన ముగ్గురు తెలుగు యువకులు మోస్ట్ వాంటెడ్ (most wanted) జాబితాలో ప్రకటించారు. పీఎఫ్ఐ కార్యకలాపాలపై దర్యాప్తులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దూకుడు పెంచింది. పీఎఫ్ఐలో క్రియాశీలకంగా పనిచేస్తున్న వారి జాబితాను విడుదల చేసింది. అందులో తెలంగాణకు చెందిన ఇద్దరు యువకులు, ఏపీకి చెందిన మరో వ్యక్తి ఉన్నారు. వారి ఫోటోలను ఎన్ఐఏ విడుదల చేసింది. వారిని పట్టిస్తే తగిన పారితోషికం ఉంటుందని ప్రకటించింది.
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన అబ్దుల్ సలీం, నిజామాబాద్‌లోని మల్లేపల్లికి చెందిన ఎండీ అబ్దుల్ అహద్ అలియాస్ ఎంఏ అహద్, ఏపీలోని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలం ఖాజానగర్‌కు చెందిన షేక్ ఇలియాస్ అహ్మద్ ఉన్నారు. వివరాలు అందించిన వారి సమాచారం గోప్యంగా ఉంచుతామని జాతీయ దర్యాప్తు సంస్థ ప్రకటించింది.