terrorists waiting to infiltrate :దేశంలోకి చొరబడేందుకు ముష్కరులు చేస్తోన్న
ప్రయత్నాలను భారత భద్రతా దళాలు ఆదిలోనే విఫలం చేస్తున్నాయని బీఎస్ఎఫ్ తెలిపింది. ప్రస్తుతం
దేశంలోకి చొరబడేందుకు 300 మంది ఉగ్రవాదులు సరిహద్దుల దగ్గర వేచి ఉన్నారని
పేర్కొంది.
గత కొన్నేళ్ళగా కశ్మీరులు, భద్రతా దళాల మధ్య అనుబంధం పెరిగిందన్న
బీఎస్ఎఫ్ ఐజీ అశోక్ యాదవ్, ప్రజల నుంచి ఇలానే సహకారం కొనసాగితే ఈ ప్రాంతంలో
అభివృద్ధి పనులు ముమ్మరం చేస్తామన్నారు. ఉగ్రవాదుల ప్రపయత్నాలను భగ్నం చేస్తామని
ధీమా వ్యక్తం చేశారు.
గతంతో
పోల్చుకుంటే జమ్ము-కశ్మీర్ ప్రాంతంలో హింస తగ్గుముఖం పట్టింది. ఉగ్రవాదుల చర్యలను
భద్రతా దళాలు ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నాయి.
పదేళ్ళ
క్రితంతో పోలిస్తే కశ్మీర్ లో ఉగ్రఘటనలు 70 శాతం, పౌరుల మరణాలు 72 శాతం, భద్రతా
దళాల మరణాలు 59 శాతం తగ్గుముఖం పట్టాయని పార్లమెంటులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా
తెలిపారు.