లోక్‌సభలో
అలజడి ఘటన కేసులో సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న లలిత్ ఝా అమాయకుడని అతని తండ్రి
దేవానంద్ చెబుతున్నారు. తన కుమారుడిని కావాలనే ఇరికించారని అవసరమైతే న్యాయం కోసం
కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమని చెప్పారు. తన కుమారుడికి సదరు ఘటనతో ఎలాంటి సంబంధం
లేదంటున్నాడు.
లలిత్ ఓ బాధ్యతాయుతమైన పౌరుడని, డిగ్రీ పూర్తి చేయడంతో పాటు కాలేజీ
లో అతనికి మంచి పేరుందన్నారు. లలిత్
ఎల్లప్పూడూ తమ మంచి గురించే తపనపడేవాడని పోలీసు విచారణ సందర్భంగా చెప్పారు. కుమారుడి పై వస్తున్న ఆరోపణలు చూసి కలత
చెందామన్నారు. గ్రామంలో ఎవరిని అడిగినా తమ కుమారుడి స్వభావం ఎలాంటిదో చెబుతారని
ఆవేదన చెందారు.
లోక్‌సభ
ఘటన గురించి తమకు తెలియదని తమ బిడ్డ చాలా మంచివాడని లలిత్ తల్లీ కన్నీరు
పెడుతోంది.
పార్లమెంటులో
అలజడి సృష్టి ఘటనలో సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న లలిత్, దిల్లీ పోలీసుల ఎదుట
లొంగిపోయాడు. లోక్‌సభ హాలులో దుండగులు చొరబడి నినాదాలు చేస్తున్న ఘటనను వీడియో
తీసిన లలిత్ అక్కడి నుంచి రాజస్థాన్ లోని నాగౌర్‌కు పారిపోయాడని పోలీసులు
చెబుతున్నారు.
వీడియోను ఓ ఎన్జీవోకు పంపి మీడియాలో వైరల్ చేయమని చెప్పినట్లు
పోలీసు విచారణలో తలింది. రాజస్థాన్ లో
అతడికి కైలాశ్, మహేశ్ అనే ఇద్దరు వ్యక్తులు హోటల్ లో నివాసం ఉండేందుకు సహకరించారు.
వారిలో మహేశ్ ను పోలీసులు అదుపులోకి
తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అలజడి ఘటన
అనంతరం లోక్‌సభ నుంచి తప్పించుకుపోయిన లలిత్, బస్సు ద్వారా దిల్లీ నుంచి రాజస్థాన్ వెళ్లాడని,
మార్గమధ్యంలో తన మొబైల్ విసిరేశాడని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
ఘటనలో
తోటి నిందితుల మొబైల్స్ ను లలితే కాల్చి వేశాడని కూడా అభియోగం నమోదైంది. బిహార్ కు
చెందిన లలిత్ కోల్ కతాలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు.
పోలీసులకు
దొరకకుండా ఉండేందుకు పోలీసులు సిగ్నల్ యాప్ ను ఉపయోగించారని, పార్లమెంట్ వద్ద
అలజడి కోసం ఏడు స్మోక్ కేన్స్ ను తెచ్చారని పోలీసులు వెల్లడించారు. నిందితులంతా
ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్నారు.