చైనాలో కరోనా కొత్త సబ్ వేరియంట్ జేఎన్ 1 కేసులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ కొత్త కోవిడ్ సబ్ వేరియంట్‌ను ముందుగా లక్సెంబర్గ్‌లో గుర్తించారు. ఆ తరవాత యూకే, ఐస్లాండ్, ఫ్రాన్స్, అమెరికాల్లో కూడా గుర్తించారు. తాజాగా ఈ సబ్ వేరియంట్ జేఎన్ 1 భారత్‌లోనూ ప్రవేశించింది. కేరళలో సబ్ వేరియంట్ జేఎన్ 1ను గుర్తించారు. దీంతో కేరళ వైద్యశాఖ అప్రమత్తమైంది.
కరోనాకు చెందిన సబ్ వేరియంట్ ఓమిక్రాన్ సబ్ వేరియంట్ బీఏ.2.86 వంశానికి చెందినది ఈ జేవన్ 1. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ దీన్ని గుర్తించింది.ఈ వైరస్(corona sub verient) చాలా వేగంగా విస్తరిస్తోంది. కరోనా లక్షణాలే ఇందులోనూ కనిపించవచ్చంటున్నారు. జ్వరం, నిరంతరం దగ్గు, త్వరగా అలసిపోవడం, జలుబు,అతిసారం, తలనొప్పి వచ్చిన వారు అశ్రద్ద చేయవద్దని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
జేఎన్ 1 సబ్ వేరియంట్‌కు సంబంధించిన ఎలాంటి వివరణాత్మక సమాచారం వెల్లడికాలేదు.సీడీసీ అంచనాల ప్రకారం ఇది వేగంగా విస్తరిస్తోంది. రోగనిరోధక వ్యవస్థ నుంచి ఇది సులభంగా తప్పించుకోగలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది కరోనా వేరియంట్ కంటే ప్రమాదకరమా కాదా అనేది తేలాలంటే మాత్రం కొంత కాలం ఆగాల్సి ఉంటుంది.