అరేబియా
సముద్రంలో హైజాక్‌కు గురైన ఐరోపా ద్వీపదేశం మాల్టాకు చెందిన నౌక కదలికలను భారత
యుద్ధనౌక పసిగట్టింది. సోమాలియా వెళుతున్న ఎంవీ రుయెన్ నౌకలోకి కొందరు సముద్రపు
దొంగలు చొరబడి దారి మల్ళించారు. హైజాక్‌కు
గురైన నౌక నుంచి మేడే కాల్ రావడంతో భారత నౌకాదళం అప్రమత్తమైంది. దానిని
కాపాడేందుకు ఎయిర్ క్రాఫ్ట్ తో పాటు యుద్ధ నౌకను రంగంలోకి దించింది.
18
మంది సిబ్బందితో సోమాలియా వైపు వెళుతున్న వాణిజ్య నౌకను హైజాక్ చేసినట్లు భారత
నౌకాదళానికి యూకే మెరైన్ ట్రేడ్ ఆపరేషన్స్(UKMTO) పోర్టల్ నుంచి సమాచారం అందింది. తమ
నౌకలోకి ఆరుగురు దుండగులు ప్రవేశించారనేది మేసేజ్ సారాంశం.
వెంటనే
అప్రమత్తమైన భారత నౌకాదళం, అరేబియా సముద్రంపై గస్తీ కాస్తున్న నావల్ మారటైం
పెట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్, గల్ఫ్ ఆఫ్ ఎడెన్ లో విధుల్లో ఉన్న యాంటీ పైరసీ పెట్రోల్
యుద్ధ నౌకను అప్రమత్తం చేసింది.
హైజాక్
కు గరైన రుయెన్ నౌకను భారత యుద్ధనౌక నేటి తెల్లవారు జామున అడ్డగించింది. సోమాలియా
పైరెట్లు 2017 తర్వాత నౌకలపై దాడి జరిగడం ఇదే మొదటిసారి. సోమాలియా తీరం సమీపంలో అప్రమత్తంగా ఉండాలని
పరిస్థితులు అనుమానాస్పదంగా ఉంటే తక్షణమే సమచారం అందజేయాలని యూకే నౌకాదళం
హెచ్చరికలు జారీ చేసింది.