ముంబై
వేదికగా జరిగిన టెస్టు మ్యాచులో 347 పరుగుల తేడాతో భారత మహిళల జట్టు విజయం
సాధించింది. 479 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు,
భారత బౌలర్ల దాటికి కేవలం 131 పరుగులకే ఆలౌటైంది. భారత స్పిన్నర్లు దీప్తిశర్మ,
రాజేశ్వరీ గైక్వాడ్ చెలరేగడంతో మూడో రోజు తొలి సెషన్ లోనే ఇంగ్లండ్ పెవిలియన్ బాట
పట్టింది.
భారత
బౌలర్లలో దీప్తిశర్మ నాలుగు వికెట్లు పడగొట్టగా, పుజ వస్త్రాకర్ మూడు, గైక్వాడ్
రెండు వికెట్లు సాధించారు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లోనూ పేలవ ప్రదర్శన కనబరిచింది.
మొదటి ఇన్నింగ్స్లో నూ 136 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌటైంది.
భారత్ తొలి ఇన్నింగ్స్ లో మాత్రం 428 పరుగుల భారీ
స్కోర్ సాధించింది.
భారత బ్యాటర్లలో శుభ సతీశ్(69), జెమీమా రోడ్రిగ్స్ (68),
యస్తిక భాటియా(66), దీప్తి శర్మ(67) రాణించారు. కెప్టెన్ హర్మాన్ ప్రీత్ కౌర్(49)
పరుగులు చేశారు.