విజయ్
దివస్ సందర్భంగా అమర సైనికుల సాహసం, త్యాగాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గుర్తు చేసుకున్నారు. దేశం
కోసం ప్రాణత్యాగం చేసిన యోధులకు నివాళులర్పించారు.
1971లో పాకిస్తాన్ యుద్ధంలో
సాహోసోపేతంగా పోరాడి భారత్ కు విజయం అందించిన సైనికుల సేవలు నేటి తరానికి
స్ఫూర్తిదాయకమని కొనియాడిన ప్రధాని, వారి అచంచలమైన దేశభక్తి భారతీయుల హృదయాల్లో
నిలిచిపోయిందన్నారు.
సైనికుల ధైర్యసాహసానికి, భయమెరుగని పరాక్రమానికి దేశం మొత్తం
సెల్యూట్ చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా కొనియాడారు.
1971 లో జరిగిన యుద్ధంలో పాకిస్తాన్ పై
భారత్ విజయం సాధించింది. పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్‌కు
విముక్తి కల్పించడంలో భారత సైన్యం కీలక పాత్ర పోషించింది. 1971లో తూర్పు పాకిస్థాన్‌లో
మొదలైన స్వాతంత్య్ర పోరు భారత్-పాకిస్తాన్ యుద్ధానికి దారి తీసింది.
13 రోజుల
పాటు జరిగిన యుద్ధంలో భారత్ 3,900 మంది సైనికులను కోల్పోయింది. భారత సైన్యం పాక్‌ను ఓడించి, బంగ్లాదేశ్ అవతరణకు
కారణమైంది. ఆ విజయానికి గుర్తుగా భారత్ ఏటా డిసెంబర్ 16న ‘విజయ్ దివస్’ నిర్వహిస్తుంది.
అమర జవాన్లకు నివాళులర్పిస్తూ వారి త్యాగాలను గుర్తు చేసుకుంటుంది.
దిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ వద్ద రక్షణ
శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, సహాయ మంత్రి అజయ్ భట్ పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు.