mastermind behind the Parliament security
breach : పార్లమెంటులో ఆగంతకుల చొరబాటు ఘటనపై విచారణ ముమ్మరంగా జరుగుతోంది.
లోక్‌సభలోకి ప్రవేశించి నినాదాలు చేసిన వ్యక్తులతో పాటు పార్లమెంటు ఆవరణలో స్మోక్
గన్స్ తో అరాచకం సృష్టించేందుకు ప్రయత్నించని వారిని అరెస్టు చేసిన పోలీసులు ఉపా
చట్టం కింది విచారిస్తున్నారు. ఈ ఘటనకు సూత్రధారిని కూడా అదుపులోకి తీసుకుని
కుట్రకు సంబంధించి మరిన్ని వివరాలు రాబడుతున్నారు.
అలజడి
ఘటనలో మాస్టర్ మైండ్ గా ఉన్న లలిత్ ఝాను అరెస్టు చేసిన పోలీసులు అతడికి ఉగ్రవాదాలు,
దేశవ్యతిరేకులతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో విచారిస్తున్నారు.
దేశంలో అరాచకం సృష్టించేందుకు కుట్ర పన్నారని,
తద్వారా తమ డిమాండ్లు నెరవేర్చుకోవాలని భావించారన్నారు. సీన్ రీక్రియేట్ చేసేందుకు పార్లమెంటు అనుమతి తీసుకుంటున్నట్లు దిల్లీ
పోలీసులు కోర్టుకు తెలిపారు.
పార్లమెంటు
వద్ద భద్రతా వైఫల్యం ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఐదుగురిని
అదుపులోకి తీసుకున్నారు. సాగర్ శర్మ, మనోరంజన్‌లను లోక్‌సభ
ఛాంబర్ లోనే ఎంపీలు చుట్టుముట్టి పట్టుకోగా, నీలం దేవి,
అమోల్ షిండేలను పార్లమెంటు భవనం వెలుపల భద్రతా సిబ్బంది
అదుపులోకి తీసుకున్నారు.
పార్లమెంటులో జరిగిన ఘటనకు సూత్రధారిగా
వ్యవహరించిన లలిత్, మొత్తం ఘటనను విజటర్స్ హాల్ నుంచి వీడియో తీయడంతో పాటు అక్కడి
నుంచి చాకచక్యంగా తప్పించుకు పారిపోయాడు.
దిల్లీ నుంచి బస్సులో ప్రయాణించి
రాజస్థాన్ చేరుకున్నాడు. అక్కడ ఓ హోటల్ లో
రెండు రోజులు నివాసం ఉన్నాడు. అందుకు అతనికి కైలాశ్, మహేశ్ అనే ఇద్దరు సహాయపడ్డారు.
పోలీసులు వారిని కూడా అరెస్టు చేసి విచారించనున్నారు.
బిహార్ కు చెందిన లలిత్ ఝా, కలకత్తాలో
ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. పార్లమెంటు పై దాడికి సంబంధించి సహా నిందితులతో
పలుసార్లు సమావేశమై చర్చించినట్లు పోలీసు విచారణలో అంగీకరించాడని దిల్లీ పోలీసులు,
పటియాలా న్యాయస్థానానికి తెలిపారు. అతడిని ఏడు రోజుల పోలీసు కస్టడికి న్యాయస్థానం
అప్పగించింది.
బహిరంగ నిరసన తో ప్రభావం చూపలేమని లోపలికి
చొరబడితేనే తీవ్రత ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతోనే
అలజడికి తెగబడినట్లు విచారణలో తేలింది.
పార్లమెంటు
భద్రతకు సంబంధించి గుగూల్ ద్వారా సమాచారాన్ని సేకరించాడు. భద్రతా సిబ్బందిని ఎలా
బురిడీకొట్టించాలనే అనే విషయంపై పక్కాగా వ్యవహరించాడు. పన్నాగం మేరకు ఎలా లొపలకి
చొరబడాలనే విషయంపై మదింపు తర్వాతే ఘటనకు పథకరచన చేశాడు.
ఘటన
తర్వాత తమ మొబైల్ ను విసిరిపడేసి, సహా నిందితుల ఫోన్లను కాల్చివేశాడు. నిరుద్యోగ
సమస్యపై నిరసన తెలియజేసేందుకు దాడికి పాల్పడినట్లు ప్రధాన సూత్రధారి చెబుతున్నప్పటికీ
పెద్ద కుట్రలో భాగంగా దాడి చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కుట్రకు సంబంధించి
విదేశీ నిధులు కూడా దుండగులకు అందినట్లు విచారణాధికారులు అనుమానిస్తున్నారు.
పొగ
బాంబులు పట్టేలా షూ తయారు చేసిన వారిని ప్రశ్నించేందుకు కూడా దర్యాప్తు బృందం
సిద్ధమైంది.
ఇప్పటికే
సీసీ కెమెరా రికార్డింగులను వడపోస్తున్న పోలీసులు, మొబైల్ ఫోన్ల డేటాను క్రోడీకరించి
విచారణను వేగవంతం చేశారు. ఒక వేళ ప్లాన్ ఏ విఫలమైతే, ప్లాన్ బి కూడా నిందితులు వద్ద ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.