తిరుమలను
పొగమంచు కమ్మేయడంతో భక్తులు యాతన పడుతున్నారు. దీంతో ముందు జాగ్రత్తగా పాపవినాశనం,
శ్రీవారి పాదాల మార్గాలను టీటీడీ మూసివేసింది. అలిపిరి మార్గంలో వెళ్ళే వాహనదారులను
అప్రమత్తం చేస్తూ ముందుకు పంపుతున్నారు.
తిరుమలలో శుక్రవారం
ఉదయం కురిసిన పొగమంచుతో చాలా చోట్ల వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వాహనాలు
స్పష్టంగా కనకపడకపోవడంతో డీకొట్టకుంటున్నాయి. దీంతో సాయంత్రం నుంచి ఆయా మార్గాలను మూసివేయాలని
అధికారులు నిర్ణయించారు.
తిరుమల శ్రీవారిని శుక్రవారం నాడు 71,037 మంది
దర్శించుకున్నారు. హుండీ ద్వారా రూ. 3.89 కోట్లు అందాయి. 25,365 మంది తలనీలాలు
సమర్పించి మొక్కులు చెల్లించారు. స్వామి దర్శనానికి 18 గంటల సమయం పడుతుండగా 10
కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
రాష్ట్రంలో
చలి పంజాకు జనం ఇబ్బందిపడుతున్నారు. ఇటీవలి మిగ్జామ్
తుపాన్ తర్వాత ఉష్ణోగ్రతలు మరింత పడిపోయాయని అధికారులు చెబుతున్నారు.
పాడేరులో కనిష్ఠ ఉష్ణోగ్రతలు
నమోదవుతున్నాయి. దట్టమైన పొగమంచు కమ్మేస్తోంది. మరో రెండు మూడు రోజులు చలి తీవ్రత
కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.