దేశీయ స్టాక్ మార్కెట్లలో బుల్ జోరు కొనసాగింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్ సూచీలు (stock markets) దూసుకెళ్లాయి. ఐటీ, బ్యాంకింగ్ స్టాక్స్ కొనుగోళ్ల మద్దతుతో భారీ లాభాలార్జించాయి. సూచీలు సరికొత్త రికార్డులను నెలకొల్పాయి.ఇవాళ సెన్సెక్స్ 970 పాయింట్లు పెరిగి, 71605 వద్ద ముగిసింది. నిఫ్టీ 273 పాయింట్లు పెరిగి 21456 వద్ద క్లోజైంది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.01గా ఉంది.
సెన్సెక్స్ 30 ఇండెక్స్ నెస్లే ఇండియా, భారతీ ఎయిల్టెల్, మారుతీ సుజుకీ, ఐటీసీ, కోటక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభాలార్జించాయి. టీసీఎస్, ఇన్ఫీ, హెచ్సీఎల్ 5 శాతంపైగా లాభపడ్డాయి. ఐటీ, మెటల్ షేర్లు మెరిశాయి. ఆటో, మీడియా, రియాల్టీ షేర్లు డీలాపడ్డాయి. ఆసియా మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి.