ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. వృద్ధాప్య పింఛన్లు రూ.3 వేలకు పెంపు ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. విశాఖనగరంలో నాలుగు కారిడార్లలో లైట్ మెట్రో రైల్ ప్రాజెక్టు డీపీఆర్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. విశాఖలోని మధురవాడలో ఓ ప్రైవేటు విద్యా సంస్థకు 11 ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్రంలోని 11 వైద్య కళాశాలల్లో నెఫ్రాలజీ, న్యూరాలజీ విభాగాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆ విభాగాల్లో 287 పోస్టుల భర్తీకి కూడా కేబినెట్ (ap cabinet meet) ఆమోదించింది. శ్రీకాకుళం, కాకినాడ, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, అనంతపురం వైద్య కళాశాలల్లో అంకాలజీ విభాగాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఏపీ సీసీటీవీ సర్వైలెన్స్ ప్రాజెక్టు, జిల్లాల్లో రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ల ఏర్పాటు కోసం రూ.552 కోట్ల రుణ సేకరణకు కూడా ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.