పార్లమెంటులో ప్రశ్నలు వేయడానికి డబ్బు తీసుకున్న వ్యవహారంలో బహిష్కరణకు గురైన టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా (mp mahua moitra) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆమె అభ్యర్ధనను వచ్చే నెల 3 లేదా 4వ తేదీన పరిశీలిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసుకు సంబంధించి అన్ని ఫైల్స్ పూర్తిగా చదవాల్సి ఉందని న్యాయమూర్తులు సంజయ్ ఖన్నా, ఎస్వీఎన్ భట్ అభిప్రాయపడ్డారు.
‘‘ఇవాళ ఉదయమే ఈ కేసుకు సంబంధించిన ఫైల్స్ అందాయి. వాటిని నేను ఇంకా చదవలేదు. వాటిని చదివేందుకు కొంత సమయం పడుతుందని, జనవరి 3 లేదా 4వ తేదీ దీనిపై నిర్ణయం తీసుకుంటామని’’ న్యాయమూర్తులు మహువా తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వీకి చెప్పారు.
లోక్‌సభలో ప్రశ్నలు వేయడానికి బెంగాల్‌కు చెందిన వ్యాపారవేత్త నుంచి డబ్బు తీసుకున్నారని ఎథిక్స్ కమిటీ నిర్థారణ చేయడంతో ఎంపీ మహువాపై డిసెంబరు 8న బహిష్కరణ వేటు పడింది. దీనిపై ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు.