ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో (road accident) దుర్మరణం చెందారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలంలోని చెరుకువాడ వద్ద ఆయన ప్రయాణిస్తోన్న కారును ఎదురుగా వచ్చిన మరో కారు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.భీమవరంలో అంగన్వాడీ కార్యకర్తల ఆందోళనలో పాల్గొనేందుకు సాబ్జీ ఏలూరు నుంచి వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
భీమవరం నుంచి ఆకివీడు వెళుతున్న ఓ కారు ఎమ్మెల్సీ సాబ్జీ ప్రయాణిస్తోన్న కారును బలంగా ఢీ కొట్టిందని స్థానికుల సమాచారం ద్వారా తెలుస్తోంది. ఈ రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ సాబ్జీ అక్కడికక్కడే చనిపోయారు. డ్రైవర్, గన్‌మెన్, ఆయన పీఏ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిని 108 అంబులెన్స్‌లో భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఎమ్మెల్సీ ఆకస్మిక మరణంపై ఏపీ క్యాబినెట్ 5 నిమిషాలపాటు సంతాపం తెలిపింది. సీఎం జగన్మోహన్ రెడ్డి పీడీఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాజ్జీ మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.