సమాజంలో న్యాయవ్యవస్థపై ప్రజలకు గౌరవంతోపాటు, భయం కూడా ఉంటుంది. అలాంటిది ఓ మహిళా న్యాయమూర్తికే లైంగిక వేధింపులు (crime news) ఎదురుకావడం విస్తుగొలుపుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని ఓ మహిళా న్యాయమూర్తికి పని ప్రదేశంలో లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. తన సీనియర్లు లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఓ మహిళా జడ్జి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి బహిరంగ లేఖ రాయడం సంచలనంగా మారింది. ఘటనపై నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆదేశించారు.
ఉత్తరప్రదేశ్‌లోని బాందా జిల్లాలో విధులు నిర్వహించిన ఓ మహిళా సివిల్ జడ్జి రాసిన లేఖ వైరల్ అవుతోంది. గత కొన్ని రోజులుగా తన సీనియర్లు లైంగికంగా వేధిస్తున్నారని, చేశారని, తనను పురుగు కంటే హీనంగా చూస్తున్నారంటూ ఆ న్యాయమూర్తి బహిరంగ లేఖలో వెల్లడించారు. హైకోర్టులో ఫిర్యాదుల కమిటీ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం దక్కకపోవడంతో ఆమె నేరుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడం వైరల్ అవుతోంది. బాధితురాలి లేఖపై స్పందించిన సీజే వెంటనే నివేదిక ఇవ్వాలని
సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్‌ను ఆదేశించారు.