అపార్టుమెంట్ ముందు మూత్రం పోయవద్దని చెప్పిన, పొరుగింటి వ్యక్తిని తుపాకీతో కాల్చిన ఘటన ఢిల్లీలో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. గురువారం ఢిల్లీలోని ఉత్తర ప్రాంతం బురాలీ రాయల్ అపార్ట్మెంట్కు చెందిన మాజీ సైనికుడు రవీంద్ర బహిరంగ మూత్ర విసర్జన చేస్తుండగా, అదే ప్రాంత వాసి హేమంత్ వారించాడు.
రెచ్చిపోయిన మాజీ సైనికుడు రవీంద్ర అతనిపై రెండు రౌండ్లు కాల్పులు (crime news) జరిపాడు. దీంతో అతన్ని సమీప ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు రవీంద్రను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రవీంద్ర మాజీ సైనికుడని, కాల్పులు జరిపిన సమయంలో అతను మద్యం సేవించి ఉన్నాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.