టీ 20లో భారత యువ ఆటగాళ్లు (T 20 Cricket) అదరగొట్టారు. దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న రెండో టీ 20లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మెరుపు సెంచరీ చేశారు. 56 బంతుల్లో 100 పరుగులు చేశాడు. కుల్దీప్ యాదవ్ 5 వికెట్లు తీయడంతో భారత్ 106 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. దీంతో సిరీస్ 1-1తో సమం అయింది.
భారత జట్టులో సూర్యకుమార్ యాదవ్ తరవాత యశస్వి జైస్వాల్ రాణించాడు. 41 బంతుల్లో 60 పరుగులు చేశాడు. భారత్ 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. కుల్దీప్ 5, జడేజా 2, అర్ష్ దీప్ 1, ముకేశ్ 1 వికెట్ తీశారు. 202 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన దక్షిణాఫ్రికా 13.5 ఓవర్లలో 95 పరుగులకే కుప్పకూలింది.
మిల్లర్ 35 పరుగులు చేశాడు.
దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న రెండో టీ 20లో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడారు. మెరుపు సెంచరీ చేయడంతో భారత్ మంచి స్కోరు చేసింది. చివరి ఓవర్లో మాత్రమే దక్షిణాఫ్రికా బౌలర్లు కట్టడి చేయగలిగారు. ఓపెనర్ జైస్వాల్ కీలక ఇన్నింగ్స్ ఆడినా, శుభ్ మన్ గిల్ 8, తిలక్ పరుగులేమీ చేయకుండానే వెనుతిరిగాడు. జైస్వాల్, సూర్యకుమార్‌కు తోడు కావడంతో భారీ స్కోరు సాధించారు.