దేశీయ స్టాక్ మార్కెట్లు (stock markets) సరికొత్త రికార్డులను నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలతోపాటు, ఫెడ్ వడ్డీ రేట్లను అమెరికా స్థిరంగా కొనసాగించడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు దూసుకెళ్లాయి. సెన్సెక్స్ 929 పాయింట్లు పెరిగి 70514 వద్ద ముగిసింది. నిఫ్టీ 256 పాయింట్లు పెరిగి 21182 వద్ద ముగిసింది. ఒకే రోజు పెట్టుబడిదారుల సంపద రూ.4 లక్షల కోట్లపైగా పెరిగింది.
సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో టెక్ మహీంద్రా, విప్రో, ఇన్ఫోసిస్, ఇండస్ ఇండ్ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, లాభాలార్జించాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, నెస్లే ఇండియా, మారుతీ సుజుకీ, టైటాన్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ కంపెనీల షేర్లు నష్టాలను చవిచూశాయి. ఆసియా మార్కెట్లన్నీ లాభాల్లో ముగిశాయి. యూరప్ మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి.