Allahabad HC Allows Plea
To Appoint Commission : శ్రీకృష్ణ జన్మభూమి మథురలోని షాహీ ఈద్గా కాంప్లెక్సులో శాస్త్రీయ
సర్వే నిర్వహించేందుకు అలహాబాద్ హైకోర్టు అనుమతించింది. వారణాసిలోని జ్ఞానవాపి
ఆలయం తరహా సర్వే నిర్వహించబోతుంది.
అడ్వకేట్ కమిషనర్‌ను నియమించిన
కోర్టు, షాహీ ఈద్గాలో సర్వేకు సూత్రప్రాయంగా అనుమతించింది. కమిషన్ విధివిధానాలను
డిసెంబర్ 18న న్యాయస్థానం ఖరారు చేయనుంది.
షాహీ ఈద్గా మసీదులో హిందూ ఆలయాలకు సంబంధించిన
గుర్తులు ఉన్నాయని ప్రస్తుతం వాటి తాలూకా వాస్తవ వివరాలు తెలుసుకునేందుకే సర్వే
కోసం పట్టుబట్టామని హిందూ సంఘాల తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది విష్ణుశంకర్
జైన్ తెలిపారు. హిందూ సంఘాలు చేస్తోన్న పోరాటంతో తాజా తీర్పు ఓ మైలురాయిగా
నిలుస్తుందన్నారు.
ఈ పిటిషన్ పై గతంలోనే వాదనలు విన్న అలహాబాద్ కోర్టు నవంబరు 18న
తీర్పును రిజర్వు చేసింది. నేడు ఉత్తర్వులు జారీ చేసింది.
మొఘుల్ రాజు ఔరంగజేబ్ పాలనలో మసీదు
నిర్మించారని, గతంలో అక్కడ హిందువులు పూజలు నిర్వహించేవారని అది ముమ్మాటీకి శ్రీకృష్ణుడి
జన్మభూమేనని న్యాయవాది వాదించారు. గోడలపై కమలం గుర్తుతో పాటు అనంతశేషుడి శిల్పాలు
ఉన్నాయని ఉటంకించారు.
శ్రీకృష్ణ జన్మభూమి కి సంబంధించి మథుర
కోర్టులో పెండింగ్ లో ఉన్న అన్ని కేసులను అలహాబాద్ హైకోర్టుకు ఈ ఏడాది మే 26న బదిలీ
చేసింది. ఈ కేసులో దాఖలైన పిటిషన్ పై సర్వోన్నత న్యాయస్థానం వచ్చే ఏడాది జనవరి 9న
విచారణ చేపట్టనుంది. వ్యాజ్యానికి సంబంధించిన అన్ని విషయాలను అందజేయాలని ఇరువర్గాలను
ధర్మాసనం ఆదేశించింది.
మథుర కోర్టులోని కేసులను అలహాబాద్ కోర్టుకు
బదిలీ చేయడాన్ని షాహీ ఈద్గా మసీదు కమిటీ సుప్రీంకోర్టులో సవాలు చేసింది.
శ్రీకృష్ణ
జన్మస్థానంలో ఉన్న మొత్తం 13.37 ఎకరాల భూమిపై తమకే హక్కును కల్పించాలని
హిందూసంఘాలు డిమాండ్ చేస్తోంది. ఇక్కడ ఉన్న కాట్ర కేశవ దేవ్ ఆలయాన్ని కూల్చి.. దాని
స్థానంలో మసీదును నిర్మించారని వాదిస్తోంది.