వచ్చే ఏడాది ఏప్రిల్ మాసంలో సార్వత్రిక ఎన్నికలు ఉండటంతో పది, ఇంటర్మీడియట్ పరీక్షలు (10th, intermediate exams) మార్చిలోనే పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇవాళ పది, ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు.
మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరుపనున్నట్లు మంత్రి తెలిపారు.ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్ష ఒక రోజు, రెండో రోజు రెండో సంవత్సరం వారికి పరీక్ష ఉంటుందని బొత్స వెల్లడించారు. పండగ సెలవులు, ఆదివారాలు పరీక్షలు ఉండవు. ఫిబ్రవరి 5 నుంచి 20 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహిస్తారు. ఇంటర్మీడియట్ వారికి ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. 2024 మార్చి 18 నుంచి పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక పదోతరగతి పరీక్షలు ఉదయం 9గంటల 30 నిమిషాల నుంచి 12 గంటల 45 నిమిషాల వరకు నిర్వహిస్తారు.