14MPs suspended till the end of winter session
సభాకార్యక్రమాలకు ఆటంకం
కలిగించినందుకు 14మంది ప్రతిపక్ష ఎంపీలను శీతాకాల సమావేశాలు పూర్తయేవరకూ లోక్‌సభ నుంచి
సస్పెండ్ చేసారు. ఆ మేరకు లోక్‌సభ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. సస్పెండ్
అయినవారిలో ఐదుగురు కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు.
నిన్నటి భద్రతా వైఫల్యం ఘటన తర్వాత ప్రతిపక్షాలు
ఈ ఉదయం నుంచీ లోక్‌సభ కార్యకలాపాలు జరగకుండా అడ్డుకుంటున్నాయి. దాంతో పార్లమెంటరీ వ్యవహారాల
మంత్రి ప్రహ్లాద్ జోషి ఐదుగురు కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్ కోసం తీర్మానం
ప్రవేశపట్టారు. సభాకార్యక్రమాలకు ఆటంకం కలిగించినందుకు, స్పీకర్ ఆదేశాలను
ధిక్కరించినందుకు కాంగ్రెస్ ఎంపీలను శీతాకాల సమావేశాలు ముగిసేవరకూ సస్పెండ్
చేయాలని తీర్మానం ప్రవేశపెట్టారు. టిఎన్ ప్రతాపన్, హిబీ ఈడెన్, జోతిమణి, రమ్య
హరిదాస్, డియాన్ కురియకోస్ కుర్యాకుస్ అనే ఎంపీలపై చర్యలు తీసుకోవాలని తీర్మానం చేసారు.
తీర్మానాన్ని పాస్ చేసే సమయంలో
స్పీకర్ స్థానంలో భర్తృహరి మెహతాబ్ ఉన్నారు. నిన్నటి ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు
జరిపించాలంటూ స్పీకర్ ఓం బిర్లా హోంశాఖ కార్యదర్శికి లేఖ రాసారని, దర్యాప్తు
మొదలయిందనీ ప్రహ్లాద్ జోషీ చెప్పారు. జరిగిన దుర్ఘటనను రాజకీయం చేయవద్దని ఆయన ప్రతిపక్షాన్ని
కోరారు.
మరోవైపు రాజ్యసభలో తృణమూల్ కాంగ్రెస్
ఎంపీ డెరెక్ ఓ బ్రియాన్‌ను కూడా శీతాకాల సమావేశాలు ముగిసేవరకూ సభ నుంచి సస్పెండ్
చేసారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ తన మాటలను ఎంతమాత్రం పట్టించుకోకుండా
డెరెక్ ఓ బ్రియాన్ ధిక్కార ధోరణితో ప్రవర్తించినందున ఆ చర్య తీసుకోవలసి వచ్చిందని
వివరించారు.