కేంద్రం ఆర్టికల్ 370 రద్దును సమర్థిస్తూ తాజాగా సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై చైనా తన అక్కసు వెళ్లగక్కింది. లద్దాఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయడాన్ని తాము గుర్తించడం లేదని ప్రకటించింది. భారత్ ఏకపక్షంగా లద్దాఖ్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించిందంటూ చైనా విదేశాంగ ప్రతినిధి మావో నింగ్ వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు తీర్పు భారత్ చైనా వాస్తవ సరిహద్దు రేఖను మార్చలేదని ఆమె వ్యాఖ్యానించారు. లద్దాఖ్ ఎప్పటికే తమ భూ భాగమేనని ఆమె స్పష్టం చేశారు.
గతంలో ఈ విషయంపై పాక్ వాదనకు చైనా వంత పాడిన విషయం తెలిసిందే. 2019 ఆగస్ట్ 5న 370 ఆర్టికల్ రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని అంతర్జాతీయ చట్టంగుర్తించలేదు. దీనికి అంతర్జాతీయంగా విలువ లేదంటూ పాక్ ప్రచారం మొదలు పెట్టింది. దీన్ని చైనా కూడా సమర్థించుకుంటూ వస్తోంది. భారత్ పాక్ మధ్య దశాబ్దాలుగా సరిహద్దు సమస్య ఉంది. ఈ సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఐరాస సూచించింది.