Fire Accident
in Bakery: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలోని
ఓ బేకరి కిచెన్లో సిలిండర్ పేలడంతో మంటలు చేలరేగాయి. మంటల్లో చిక్కుకుని 15 మంది
గాయపడ్డారు. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది.
కార్మికులంతా
ఉత్తరప్రదేశ్ కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. తీవ్రంగా గాయపడిన వారిని
కంచన్ బాగ్ లోని డీఆర్డీవో ఆస్పత్రికి తరలించారు.
గ్యాస్ లీక్ కావడంతోనే మంటలు అలుముకుని
సిలిండర్ పేలి ఉంటుందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ప్రమాదం జరిగిన సమయంలో ఘటనాస్థలంలో 40 మంది
కార్మికులు ఉన్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ప్రమాదస్థలానికి
వెళ్ళి మంటలు అదుపు చేశారు. పోలీసులు కూడా సంఘటనా ప్రదేశానికి వెళ్ళి సహాయ చర్యలు
చేపట్టారు.
ఘటనపై
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అవసరమైన చర్యలు తక్షణమే
చేపట్టాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని
సూచించారు.