అమెరికాలో
భారతీయ అమెరికన్ల ఆధ్వర్యంలోని సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం కొత్త క్యాంపస్ లోకి
మారనుంది. మరో కొత్త కోర్సును కూడా విద్యార్థులకు అందించనుంది. లలితకళలు, భారతీయ
సంప్రదాయ నృత్యాలు, భాషలకు సంబంధించి కోర్సులతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్‌ను
ఇక నుంచి విద్యార్థులకు బోధించనున్నారు.
మెడికల్
కాలేజీ, అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్టేడియం సౌకర్యాలతో పాటు వర్సిటీ క్యాంపస్‌ను
విస్తరిస్తున్నట్లు నిర్వాహకులు ఆనంద్ కూచిభట్ల తెలిపారు. ఓ దాత విరాళంగా అందజేసిన
67 ఎకరాల స్థలంలో దీన్ని ప్రారంభించినట్లు తెలిపారు.
కాలిఫోర్నియాలోని
మిల్పిటస్ మెయిన్ క్యాంపస్ ఉండగా, ఇందులో 230 మంది అభ్యసిస్తున్నారు.
మాస్టర్ ఆఫ్
సైన్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్, మెషిన్ లెర్నింగ్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్,
ఎండీ ఇన్ అలోపతి మెడిసెన్ కోర్సులు ప్రవేశపెట్టబోతున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
భారతదేశంలోని 12 విశ్వవిద్యాలయాలతో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు.