భారత్‌లో జెట్ ఇంధనాన్ని నింపుకుని వెళుతోన్న ఆర్డ్ మోర్ అనే సరకు రవాణా నౌకపై హైతీ రెబల్స్ దాడికి యత్నించారు. బాబ్ ఎల్ మండెప్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ముందు మిలిటెంట్లు క్షిపణి (crime news) ప్రయోగించారు. అది గురితప్పి సముద్రంలో పడిపోయింది. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఇంధనం తీసుకెళుతోన్న నౌకపై హైతీ రెబల్స్ దాడి చేయడం ఇదే మొదటిసారి.హైతీ రెబల్స్ ప్రయోగించిన డ్రోన్‌ను అమెరికా యుద్ధ నౌక కూల్చివేసింది.
కర్ణాటకలోని మంగళూరు నుంచి ఈ నౌక బయలు దేరింది. మార్షల్ ఐలాండ్స్కు చెందిన ఈ నౌక జెట్ ఇంధనాన్ని తరలిస్తోంది. దాడియత్నం తరవాత దుండగులు నౌకలో చొరబడే ప్రయత్నం చేశారు. భద్రతా సిబ్బంది కాల్పులు జరపడంతో వారు పారిపోయినట్లు తెలుస్తోంది. నౌకలో సిబ్బంది అంతా క్షేమంగా ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. షెల్ ఎంఆర్‌పీఎల్ ఏవియేషన్ ఫ్యూయెల్స్ అండ్ సర్వీసెస్ కంపెనీ తయారు చేసిన జెట్ ఇంధనాన్ని ఆర్డ్ మోర్ నౌక నెదర్లాండ్స్, స్వీడన్ తరలిస్తోండగా
బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది.