Allahabad University Explosion :
అలహాబాద్
విశ్వవిద్యాలయం వసతిగృహంలో పేలుడు జరిగిన ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
హాస్టల్ రూమ్లో ఓ విద్యార్థి బాంబు తయారు చేస్తుండగా పేలుడు సంభవించింది. దీంతో
సదరు విద్యార్థి తీవ్రంగా గాయపడటంతో పాటు తోటి విద్యార్థి ప్రాణాల మీదకు తెచ్చాడు.
అలహాబాద్
విశ్వవిద్యాలయంలో ప్రభాత్ యాదవ్ అనే ఎమ్ఏ విద్యార్థి, పీసీ బెనర్జీ వసతిగృహంలో
నివాసం ఉంటున్నాడు. అక్కడ అతను బాంబు తయారీకి యత్నించగా పెద్ద పేలుడు జరగడంతో కుడి
చేతికి తీవ్ర గాయాలు అయినట్లు, శివ్కుటి
అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ రాజేశ్ కుమార్ యాదవ్ తెలిపారు. గాయపడిన విద్యార్థులను
ఎస్ఆర్ఎన్ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ప్రభాత్ యాదవ్ పై
కేసు నమోదు చేస్తున్నట్లు వెల్లడించారు.