దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభం అయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన సంకేతాలతో స్టాక్ సూచీలు (stock markets) దూసుకెళుతున్నాయి. ఉదయం ప్రారంభంలోనే స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల పరుగు పెట్టాయి. సెన్సెక్స్ 665 పాయింట్ల లాభంలో 70249 పాయింట్ల వద్ద మొదలైంది. నిఫ్టీ 186 పెరిగి, 21112 వద్ద కొనసాగుతోంది.
పీటీసీ ఇండస్ట్రీస్, పైసాలో డిజిటల్,అదానీ గ్రీన్ ఎనర్జీ, టాన్లా ఫ్లాట్ ఫామ్స్, ఎన్బీసీసీ ఇండియా షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఛంబల్ ఫర్లిలైజర్స్, అరవింద్ లిమిటెడ్ షేర్లు నష్టాలను చవిచూశాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.83.38 వద్ద కొనసాగుతోంది.అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు యథాతథంగా కొనసాగించడంతో స్టాక్ మార్కెట్లకు ఊతం లభించింది.