ఏపీ పోలీస్ శాఖలో హోంగార్డు ఉద్యోగాలిప్పిస్తామంటూ ఓ ముఠా భారీ మోసానికి (crime news ) తెగబడింది. దాదాపు 200 మంది నుంచి రూ.16 కోట్లు వసూలు చేశారు. ఇందులో ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి ప్రమేయం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆ విషయం గోప్యంగా ఉంచారు. ఆ ఐపీఎస్ అధికారి అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. కేసు వివరాలు పరిశీలిస్తే విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
పోలీస్ శాఖలో హోంగార్డుల ఉద్యోగాల భర్తీ జరుగుతోంది. దీన్ని ఆసరాగా చేసుకుని నరేష్ అనే వ్యక్తి దాదాపు 200 మంది యువకుల నుంచి ఒక్కొక్కరి నుంచి రూ.8.5 లక్షల చొప్పున వసూలు చేశాడు. అందులో కొందిరికి పలు జిల్లాల్లో హోంగార్డు ఉద్యోగాలు కూడా ఇప్పంచినట్లు తెలుస్తోంది.కొందరు డబ్బు చెల్లించినా ఉద్యోగం రాలేదు. డబ్బు చెల్లించినా ఉద్యోగం రాకపోవడంతో కడప జిల్లా పెదముడియంకు చెందిన మనోజ్ కుమార్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అసలు సూత్రధారి ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి అని తేలడంతో పోలీసులు విస్తుపోయారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.