Home ministry set up committee to inquire LS
incident
పార్లమెంటులో భద్రతా
వైఫల్యం ఘటనపై దర్యాప్తు చేయడానికి కేంద్ర హోంశాఖ ఒక కమిటీని నియమించింది. సీఆర్పీఎఫ్
డీజీ అనీష్ దయాళ్ సింగ్ ఆ కమిటీకి నేతృత్వం వహిస్తారు.
భద్రతా వైఫల్యానికి
కారణాలపై ఆ కమిటీ దర్యాప్తు చేస్తుందని, లోపాలను గుర్తించి తదుపరి కార్యాచరణకు
సిఫారసులు చేస్తుందని హోంశాఖ ఎక్స్ మాధ్యమం ద్వారా ట్వీట్ చేసింది. ఆ కమిటీ తన
సిఫారసులతో పాటు పార్లమెంటులో భద్రతను పెంచడం గురించి సలహాలు కూడా ఇస్తూ, తన
నివేదికను వీలైనంత త్వరగా సమర్పిస్తుందని హోంశాఖ వెల్లడించింది.
పార్లమెంటు వద్ద పలు
అంచెల్లో భద్రతా ఏర్పాట్లుంటాయి. మొదట సందర్శకుల వివరాలను పరీక్షిస్తారు. వారిని
భౌతికంగా తనిఖీ చేస్తారు. వారి బ్యాగేజీని కూడా తనిఖీ చేస్తారు. లోపలికి వివిధ
అంచెల్లో మెటల్ డిటెక్టర్ ద్వారానే ప్రవేశించనిస్తారు. ఢిల్లీ పోలీసులు, సీఆర్పీఎఫ్
సిబ్బంది సహా పలు ఏజెన్సీలు ఈ భద్రతా ఏర్పాట్లు చేస్తాయి.
చొరబాటుదారులు తమ షూస్‌లో
స్మోక్ క్యానిస్టర్లను దాచి తీసుకువెళ్ళారనీ, అందువల్లనే వాటిని భౌతిక తనిఖీల
సమయంలో తెలుసుకోలేకపోయారనీ సమాచారం.