Who are the intruders
into Lok Sabha
పార్లమెంటు లోక్‌సభలో ఇవాళ గందరగోళం
సృష్టించిన వారెవరు? వారిద్దరూ పాతికేళ్ళ లోపు యువకులు అని తెలుస్తోంది. పటిష్ట భద్రతావలయాన్ని
ఛేదించి వారు లోక్‌సభలో కృత్రిమ వాయువులను ఎలా వదిలారన్నది తెలియాల్సి ఉంది.
సందర్శకుల గ్యాలరీ నుంచి లోక్‌సభ
ఛాంబర్స్‌లోకి దూకినవారు సాగర్ శర్మ, డి. మనోరంజన్ (35) అని ఢిల్లీ పోలీసులు
వెల్లడించారు. వారిద్దరూ కర్ణాటక మైసూరుకు చెందినవారు. మనోరంజన్ మైసూరు సిటీ
కాలేజ్ నుంచి కంప్యూటర్ సైన్సెస్‌లో గ్రాడ్యుయేషన్ చేసాడు. పార్లమెంటు బైట దొరికిన
వారు నీలమ్ (42) హర్యానాలోని హిసార్‌కు చెందిన మహిళ, అమోల్ షిండే (25) మహారాష్ట్రలోని
లాతూర్కు చెందిన వ్యక్తి. నీలమ్ సివిల్ సర్వీసెస్‌కు సిద్ధమవుతోంది.
ఢిల్లీ పోలీస్ విభాగంలోని యాంటీ టెర్రర్ సెల్
నలుగురినీ అరెస్ట్ చేసింది. ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరా, ఇతర ఉన్నతాధికారులు
లోక్‌సభకు చేరుకున్నారు.
బీజేపీకి చెందిన మైసూరు ఎంపీ ప్రతాప సింహ
కార్యాలయం నుంచి సందర్శకుల పాస్ పొందినట్లు తెలుస్తోంది. పటిష్టమైన ఐదంచెల భద్రతా
వ్యవస్థను దాటుకుని వారు పేలుడు పదార్ధాన్ని లోపలికి ఎలా తీసుకువెళ్ళారన్నది ఇంకా
కనుగొనవలసి ఉంది.
ఈ ఘటన బాధ్యుల్లో ఒకరిని కాంగ్రెస్ ఎంపీ
గుర్జీత్ సింగ్ ఔజ్లా తానే స్వయంగా పట్టుకుని నిర్బంధించారు. ‘అతని చేతిలో ఏదో ఉంది.
దాన్నుంచి పసుపురంగు వాయువు విడుదల అవుతోంది. ఆ క్యాన్‌ను లాక్కుని బైటకు
విసిరేసాను’ అని చెప్పారు.
నిందితులు చెప్పిన
వివరాలు సరైనవో కావో తెలుసుకోడానికి ప్రత్యేక బృందాలు వారి స్వగ్రామాలకు
బయల్దేరారు. మైసూరులోని ఇద్దరు నిందితుల ఇళ్ళకు చేరుకున్నారని తెలుస్తోంది. పార్లమెంటులో
ఘటనకు తనదే బాధ్యత అని లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా ప్రకటించారు.
ఈ భద్రతా వైఫల్యంపై సత్వర ర్యాప్తు చేయిస్తామని హామీ ఇచ్చారు.