వైసీపీ
ప్రభుత్వంపై జనసేన పీఏసీ నేత నాదెండ్ల మనోహర్ తీవ్ర ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వాల
హయాంలో పలు ప్రాజెక్టుల కోసం భూమి తీసుకున్న కంపెనీలను పాలక పార్టీ పెద్దలు బెదిరించి
క్విడ్ ప్రోకు పాల్పడ్డారన్నారు. దివంగత సీఎం వైఎస్ హయాంలో ప్రభుత్వం నుంచి సెజ్ ల
కోసం భూములు పొందిన యాజమాన్యాలను జగన్ ప్రభుత్వం వేధించి, బెదిరించి మళ్ళీ భూములు
కట్టబెడుతోందని ఆరోపించారు.
విశాఖలో
జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో రూ.13 లక్షల కోట్ల ఎంవోయూలు జరిగాయని
చెప్పిన పాలక పెద్దలు ఆ దిశగా ఉద్యోగాల కల్పన ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు.
వచ్చే ఎన్నికల్లో అధికారం కోల్పోతామని తెలిసి క్లియరెన్స్ సేల్ మొదలు పెట్టారని
ఎద్దేవా చేశారు. కంపెనీలకు చిత్రవిచిత్రమైన ప్యాకేజీలు ప్రకటిస్తున్నారని తప్పుబట్టారు.
గత ప్రభుత్వాలు భూములు కేటాయిస్తే కంపెనీలు ఏర్పాటు చేయలేమంటూ రద్దు చేసుకున్నవారికి
మళ్ళీ భూములు కట్టబెట్టడం వెనుక మతలబేంటన్నారు.
వైఎస్
హయాంలో చాలా మందికి సెజ్ లు కేటాయించారన్న నాదెండ్ల మనోహర్, జగన్ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాద్యతలు
చేపట్టిన తర్వాత, భూమిని తిరిగి తీసుకునేందుకు ప్రయత్నించారని ఆరోపించారు.
కృష్ణపట్నం
అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు కు 2007లో 2,680 ఎకరాలు కేటాయిస్తే జగన్ ప్రభుత్వం లాగేసుకుందామని
ప్రయత్నించి మళ్లీ కొత్త రాయితీలతో అప్పగిస్తోందన్నారు.
అనంతపురం జిల్లా హిందూపురంలో నియోజన్
ప్రాపర్టీస్ ప్రాజెక్టు కు SEZ కింద భూములు కేటాయించారని వైసీపీ బాధిత కంపెనీల్లో
ఇది కూడా ఒకటి అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సదరు కంపెనీ కోర్టుకు కూడా
వెళ్ళింద్నారు. యాజమాన్యం అడిగిన దానిని ఆమోదిస్తూ నవంబరు 3న కేబినెట్ ఆమోదం
తెలిపిందన్నారు. క్విడ్ ప్రోకో విధానంలో
భాగంగానే ఇలాంటి ఒప్పందాలు చేసుకుంటున్నారని ఆరోపించారు.