NIA raids in Bengaluru: ఉగ్రవాదుల కుట్ర
కేసు విచారణలో భాగంగా బెంగళూరులో అర డజను చోట్ల జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) సోదాలు జరుపుతోంది. దేశవ్యాప్తంగా రెండురోజులుగా పలు చోట్ల ఎన్ఐఏ దాడులు
కొనసాగుతుండగా నేడు బెంగుళూరులో ఏకకాలంలో ఆరు ప్రదేశాల్లో దాడులు
కొనసాగుతున్నాయి. కన్నడ పోలీసులు, ఎన్ఐఏ
అధికారులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారు.
ఉగ్రవాదులతో
సంబంధాలతో పాటు విదేశీ నిధుల దారి మళ్ళింపులో కీలకంగా వ్యవహరించారనే అభియోగాలు ఆధారంగా
ఈ దాడులు చేపట్టారు. పలువురు అనుమానితులు, ఉగ్రవాదచర్యల్లో చురుగ్గా
పాల్గొంటున్నారనే సమాచారం కూడా అందినట్లు అధికారులు చెబుతున్నారు.
అంతర్జాతీయ
ఉగ్రవాద సంస్థ ఐసిస్ కుట్రలను భగ్నం చేసే చర్యల్లో భాగంగా ఎన్ఐఏ పలు చోట్ల సోదాలు
చేపట్టింది.
రెండు రోజుల కిందట మహారాష్ట్ర, కర్ణాటకలోని 44 ప్రాంతాల్లో విచారించిన
అధికారులు, 15 మందిని అరెస్టు చేశారు. దాడుల్లో భారీ మొత్తంలో లెక్కలోకి రాని
నగదుతో పాటు తుపాకులు, ఆయుధాలు, కొన్ని పత్రాలతో పాటు స్మార్ట్ ఫోన్లు, డిజిటల్ పరికరాలు
స్వాధీనం చేసుకున్నారు.
నిందితులంతా
ఐఎస్ఎస్ మహారాష్ట్ర మాడ్యూల్ లో సభ్యులుగా ఉండటంతో పాటు పద్ఘా-బొరివలిలో వేదికగా
ఉగ్రకార్యకలాపాల్లో పాల్గొంటున్నారు.
స్థానికంగా ఉగ్రవాద చర్యలను వ్యాప్తి చేయడంతో
పాటు దేశమంతటా హింసాత్మక చర్యలకు కుట్ర పన్నారని విచారణలో తేలింది. ఆత్మాహుతి, ఖిలాఫత్, ఇతర
తీవ్రవాద మార్గాల్లో భారత్ లో అశాంతి సృష్టికి
కుట్రపన్నారని ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని
దర్యాప్తులో వెల్లడైంది.
థానే పరిధిలి పద్ఘా గ్రామాన్ని ఆల్ షామ్ గా
ప్రకటించుకున్నారు. ముస్లి యువతను తీవ్రవాదం ప్రేరేపిస్తున్నారు.