BCCI announces India U19 squad:
దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న ఐసీసీ అండర్ -19 వరల్డ్ కప్(Men’s U19 World Cup) కు బీసీసీఐ జట్టును ప్రకటించింది. ప్రపంచకప్ కు ముందు డిసెంబరు 29 నుంచి జరిగే ముక్కోణపు
సిరీస్ లోనూ ఈ జట్టు పాల్గొంటుందని
బీసీసీఐ జూనియర్ సెలక్షన్ కమిటీ వెల్లడించింది.
జనవరి
19 నుంచి అండర్-19 వరల్డ్కప్ పోటీలు జరగనున్నాయి.
భారత యువజట్టులోఇద్దరు
హైదరాబాదీలకు చోటు లభించింది. ఆరవెల్లి అవనీశ్ రావు, మురగన్ అభిషేక్-19 భారత
జట్టులో చోటు సంపాదించారు. అవనీశ్ రావు వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ కాగా, మురుగన్
అభిషేక్ బౌలర్.
అండర్-19 క్రికెట్ భారత జట్టు…
ఉదయ్ సహారన్ (కెప్టెన్), సౌమ్య్ కుమార్ పాండే
(వైస్ కెప్టెన్), అర్షిన్ కులకర్ణి, ఆదర్శ్ సింగ్, రుద్ర మయూర్ పటేల్, సచిన్ దాస్, ప్రియాన్షు మొలియా, ముషీర్ ఖాన్, ఆరవెల్లి అవనీశ్ రావు
(వికెట్ కీపర్), మురుగన్ అభిషేక్, ఇన్నేశ్ మహాజన్
(వికెట్ కీపర్), ధనుష్ గౌడ, ఆరాధ్య శుక్లా, రాజ్ లింబానీ, నమన్ తివారీ.
బ్యాకప్
ప్లేయర్లు…
దిగ్విజయ్ పాటిల్, జయంత్ గోయత్, పి.విఘ్నేశ్, కిరణ్ చార్మోలే
అండర్-19 వరల్డ్ కప్ లో భాగంగా భారత జట్టు జనవరి 20న తన ప్రస్థానాన్ని
ప్రారంభించనుంది. టోర్నీలో తొలి మ్యాచ్ ను బంగ్లాదేశ్ తో ఆడనుంది. భారత కుర్రాళ్ల
జట్టు ‘ఏ’ గ్రూపులో ఉంది. ఇందులో
బంగ్లాదేశ్, ఐర్లాండ్, అమెరికా జట్లు ఉన్నాయి.
దక్షిణాఫ్రికా ఆతిథ్యమిస్తున్న అండర్-19 వరల్డ్కప్ టోర్నమెంట్
2024 జనవరి 19 నుంచి ఫిబ్రవరి 11 వరకు జరగనుంది.