Bharat vs South Africa: దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా రెండో టీ20లో (2nd T20
match) భారత జట్టు ఓడింది. వర్షం కారణంగా ఆటకు అంతరాయం ఏర్పడటంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 5 వికెట్ల తేడాతో
భారత్ పరాజయం చెందింది. లక్ష్య చేధనలో భాగంగా దక్షిణాఫ్రికా ఆటగాళ్ళు మార్ర్కమ్,
హెండ్రిక్స్ మెరుగైన ఇన్నింగ్స్ ఆడటంతో సఫారీ జట్టు విజయం సాధించింది.
టాస్
ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు, 19.3 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 180
పరుగులు చేసింది. వాన కారణంగా ఆట నిలిచిపోయింది.
రింకూ
సింగ్ (39 బంతుల్లో 68 నాటౌట్), సూర్యకుమార్ యాదవ్(36 బంతుల్ 56) తో విజృంభించారు.
రుతురాజ్ అనారోగ్యంతో ఆడలేకపోయారు. ఓపెనర్లు యశస్వీ జైస్వాల్(0), శుబ్‌మన్ గిల్(0)
విఫలం కావడంతో ఆరు పరుగులకే భారత్ రెండు వికెట్లు కోల్పోయింది. మూడో స్థానంలో
వచ్చిన తిలక్ వర్మ 20 బంతుల్లో 29 పరుగులు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ 29 బంతుల్లో
50 పరుగులు చేశాడు. 30 బంతుల్లో రింకూ సింగ్ హాఫ్ సెంచరీ చేశాడు.
కొయెట్జీ
3 కీలకమైన వికెట్లు తీయగా, మార్కో యెన్సెన్, విలియమ్స్, షంసీ, మార్ర్కమ్ చెరో
వికెట్ పడగొట్టారు.
డక్
వర్త్ లూయిస్ పద్ధతిలో దక్షిణాఫ్రికా లక్ష్యాన్ని 15 ఓవర్లకు 152 పరుగులకు కుదించారు.
సఫారీ జట్టు 5 వికెట్లు కోల్పోయి 13.5 ఓవర్లలోనే ఛేదించింది.
రీజా
హెన్డ్రిక్స్(27 బంతుల్లో 49), మార్క్రమ్(30) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. మిల్లర్
(17), స్టబ్స్ (14) జట్టును విజయం వైపు నడిపించారు.
భారత్ భారీ స్కోరు చేయకుండా
నియంత్రించిన షంసీకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. దీంతో మూడు మ్యాచుల
టీ20 సిరీస్ లో భారత్ 1-0తో వెనకబడింది. మొదటి వాన కారణంగా రద్దు అయింది. చివరి
మ్యాచ్ గురువారం జరగనుంది.