Rajasthan CM Bhajanlal Sharma : మధ్యప్రదేశ్,
ఛత్తీస్గఢ్ లో ముఖ్యమంత్రిగా
కొత్తవారిని ఎన్నుకున్న బీజేపీ, రాజస్థాన్లో కూడా ఇదే తరహా వ్యూహాన్ని
అనుసరించింది. రాజస్థాన్ ముఖ్యమంత్రిగా భజన్ లాల్ శర్మ (Bhajan Lal Sharma)ను బీజేపీ శాసనసభా పక్షం ఎన్నుకుంది. ముఖ్యమంత్రి అభ్యర్థి గా శర్మ పేరును సీఎం రేసులో
ఉన్న వసుంధరా రాజే, కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ సమక్షంలో ప్రకటించడం మరో విశేషం.
పోటీలోని రాజపుత్రుల వారసులను పక్కనపెట్టి బ్రాహ్మణ సామాజిక
వర్గానికి చెందిన భజన్ లాల్ శర్మ అభ్యర్థిత్వానికి బీజేపీ కేంద్రనాయకత్వం
మొగ్గుచూపింది.
సంగనేర్
నియోజకవర్గం నుంచి పోటీ చేసిన శర్మ, కాంగ్రెస్ అభ్యర్థి పుష్పేంద్ర భరద్వాజ్ పై
48, 081 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
సీఎం పదవి కోసం మాజీ ముఖ్యమంత్రి వసుంధరా
రాజే, గజేంద్ర షెకావత్, బాబా బలక్ నాథ్, దియా కుమారి, అనిత్ భదేతల్, మంజు, బఘ్
మర్, అర్జున్ మేఘ్వాల్ పోటీ పడ్డారు.
దియా
కుమారి, ప్రేమ్ చంద్ బైర్వా ఉపముఖ్యమంత్రులుగా
ఎన్నికయ్యారు. స్పీకర్ గా వాసుదేవ్ దేవ్నని బాధ్యతలు చేపట్టనున్నారు.
గతంలో
విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన వాసుదేవ్, ప్రస్తుతం అజ్మీరు నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం
వహిస్తున్నారు.
భజన్
లాల్ శర్మ, బీజేపీ రాజస్థాన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాలుగు పర్యాయాలు
పనిచేశారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తో పాటు అఖిల భారత విద్యార్థి పరిషత్ లో
పనిచేశారు. ఎమ్మెల్యేగా గెలిచిన మొదటి సారే ముఖ్యమంత్రి పదవి ఆయనను వరించింది.