Suicide attack claims 23
lives in Pakistan
పాకిస్తాన్లోని ఒక ఆర్మీబేస్ మీద ఉగ్రవాదులు
ఆత్మాహుతి దాడి చేసిన ఘటనలో 23మంది ప్రాణాలు కోల్పోయారు. ఆప్ఘనిస్తాన్
సరిహద్దుల్లో ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రొవిన్స్ డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలోని
ఆర్మీబేస్ మీద గత అర్ధరాత్రి దాటిన తర్వాత ఆ దాడి జరిగింది.
పాకిస్తానీ తాలిబన్ అనే ఉగ్రవాద సంస్థ ఆత్మాహుతి
దాడికి పాల్పడింది. పాక్ సైన్యం తాత్కాలిక స్థావరం ఏర్పాటు చేసుకున్న ఒక పాఠశాల
భవనంలోకి ఉగ్రవాదులు పేలుడు పదార్ధాలు నింపిన వాహనంతో దూసుకుని వెళ్ళిపోయారు. అర్ధరాత్రి
దాటాక 2.30 గంటలకు జరిగిన ఆ దాడిలో బడిలోని మూడు గదులు కూలిపోయాయి. 23 మంది చనిపోవడమే
కాదు, మరో 27మంది గాయపడ్డారు.
పాకిస్తానీ తాలిబన్ సంస్థకు అనుబంధంగా ఇటీవలే
ఏర్పడిన తెహరీక్-ఎ-జిహాద్ పాకిస్తాన్ సంస్థ… ఈ ఘటనను అమరవీరుడి దాడిగావర్ణించింది.
పాకిస్తాన్ సైన్యం ఈ ఘటనపై ఇప్పటివరకూ ఏమీ వ్యాఖ్యానించలేదు.
పాకిస్తాన్లో ఇటీవల మిలిటెంట్ దాడులు
పెచ్చుమీరిపోయాయి. ముఖ్యంగా 2021లో ఆప్ఘనిస్తాన్లో తాలిబన్ పాలన వచ్చిన నాటినుంచీ
ఆప్ఘన్ సరిహద్దు ప్రాంతాల్లో ఆ దాడులు ఎక్కువ జరుగుతున్నాయి.