Bharatiya Kisan Morcha protest: తుపాను కారణంగా నష్టోయిన రైతులను ఆదుకోవడంలో
వైసీపీ ప్రభుత్వ విఫలమైందని కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి
కుమారస్వామి విమర్శించారు. రైతులు పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి
నిరసనగా రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చినట్లు చెప్పారు. ఈ నెల 13న రాష్ట్రంలోని
అన్ని ప్రాంతాల్లో కిసాన్ మోర్చా చేపట్టే ఆందోళన కార్యక్రమాల్లో రైతులు, రైతు
సంఘాలు, రాజకీయపార్టీల కార్యకర్తలు పాల్గొని నిరసన తెలపాలని కోరారు.
తడిసిన
ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయడంతో పాటు పంట నష్టం వివరాల నమోదు ప్రక్రియ ప్రారంభించాలని
కుమార స్వామి కోరారు.
తుపానుతో
నష్టపోయిన రైతులు ఆర్థిక ఇబ్బందులతో అల్లాడుతుంటే ప్రభుత్వం మాత్రం చోద్యం చూస్తోందని
విమర్శించిన కుమారస్వామి, సీఎ జగన్ రైతు
వ్యతిరేకి అంటూ దుయ్యబట్టారు.
పత్తి, మిరప, పొగాకు, అరటి, పసుపు పంటలకు ఎకరాకు రూ.50 వేలు చొప్పున ప్రభుత్వం నష్టపరిహారం అందజేయాలని
డిమాండ్ చేశారు. ఉద్యానవన పంటలకు ఎకరాకు
లక్ష రూపాయల సాయం అందించి ఆదుకోవాలన్నారు.
డ్రైయినేజీ,
ఇరిగేషన్ కాలువులు ఆధునికీకరించడంతో పాటు పంట నష్టపోయిన రైతులకు రుణ మాఫీ
చేయాలన్నారు. ఎరువులు, విత్తనాలను రైతులకు ఉచితంగా అందించాలన్నారు.
రైతుల
శ్రేయస్సు కోసం కిసాన్ మోర్చా చేపట్టే కార్యక్రమాల్లో ప్రజలంతా భాగస్వామ్యం కావాలని కోరారు.