Centre rolls out new guidelines: ప్రైవేటు సంస్థల నుంచి ప్రభుత్వ ఉద్యోగులు, అవార్డుల
స్వీకరణకు కేంద్రప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఉన్నతాధికారుల అనుమతి
తోనే అవార్డులు స్వీకరించాలని స్పష్టం చేసింది. అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే
అనుమతులు ఇవ్వాల్సి ఉంటుందని సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ
చేసింది.
నగదు, ఇతర సదుపాయాల రూపంలో అవార్డులు
ఉండకూడదని స్పష్టంచేసింది.
ప్రైవేటు
సంస్థలు, సంఘాలు అందజేసే అవార్డులను సంబంధిత ఉన్నతాధికారులు ముందుస్తు అంగీకారం
తర్వాతే ప్రభుత్వ ఉద్యోగులు స్వీకరించాలని పేర్కొంది. మంత్రిత్వ శాఖ నుంచి లేదా,
పనిచేసే విభాగం సెక్రటరీ అనుమతి పొందాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. ఒక వేళ సెక్రటరీ
ర్యాంకు అధికారులే అవార్డులు స్వీకరించాలంటే కేబినెట్ కార్యదర్శి నుంచి అనుమతి
తీసుకోవాలని వివరించింది.
1964
నాటి కేంద్ర సివిల్ సర్వీసెస్ చట్టంలోని రూల్ 14 ప్రకారం, ఏ ప్రభుత్వ ఉద్యోగి,
ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి సన్మానం, సత్కారం స్వీకరించ కూడదు. ఉద్యోగి గౌరవార్దం
జరిగే సభలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగం కారాదు.
1999
లో సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ, జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ప్రభుత్వ
సిబ్బంది, ప్రైవేటు సంస్థల నుంచి ఎలాంటి అవార్డులు, రివార్డులు స్వీకరించకూడదు.
ఉద్యోగుల సేవ, ప్రతిభను అంచనా వేసేందుకు ప్రభుత్వంలోనే అంతర్గతంగా అనేక పద్ధతులు
ఉన్నాయని పేర్కొంది.
2000
సంవత్సరంలో కూడా ప్రభుత్వం ఇదే తరహా ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో
ఉల్లంఘనలు జరుగుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేసింది.
ఉద్యోగులంతా తప్పనిసరిగా తాజా మార్గదర్శకాలు
పాటించాలని స్పష్టం చేసింది.