కోర్టు ఆదేశాలు అమలు చేయని గుంటూరు మున్సిపల్ కమిషనర్ కీర్తికి హైకోర్టు (ap highcourt) జైలు శిక్ష విధించింది. గుంటూరు పరిధిలోని యడవలి వారి సత్రాన్ని అక్రమంగా కొందరు ఆక్రమించుకుని, కార్పొరేషన్‌ను ఎటువంటి అద్దె చెల్లించకుండా, అందులో పాఠశాల నడుతున్నారని హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. దీనిపై కోర్టు గతంలోనే విచారించింది. పిటిషనర్లకు రూ.25 లక్షలు చెల్లించాలని కమిషనర్‌ను ఆదేశించింది.
కోర్టు ఆదేశాలను గుంటూరు మున్సిపల్ కమిషనర్ అమలు చేయలేదు. దీంతో వారు మరోసారి కోర్టును ఆశ్రయించారు. కోర్టు దిక్కరణ కేసును విచారించిన హైకోర్టు, మున్సిపల్ కమిషనర్ కీర్తికి నెల రోజుల జైలు శిక్ష, రూ.25 వేల జరిమానా విధించింది. జనవరి 2న హైకోర్టు రిజిస్ట్రార్ వద్ద లొంగిపోవాలని ధర్మాసనం ఆదేశించడం సంచలనంగా మారింది.