Karni Sena chief murder:
శ్రీ
రాష్ట్రీయ రాజ్పుత్ కర్ణిసేన అధినేత సుఖదేవ్ సింగ్ గోగమెడి హత్య కేసు దర్యాప్తులో
విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గ్యాంగ్స్టర్స్ నెట్వర్క్తో పాటు నేరస్తులకు ఆయుధాలు ఎలా అందాయనే విషయం ఓ
కొలిక్కి వచ్చింది.
కర్ణిసేన చీఫ్ హత్య కేసు నిందితులతో నేరపూరిత
సంబంధాలు కలిగి ఉన్న ఓ మహిళను (woman
arrested) పోలీసులు అరెస్టు
చేయగా ఆమె భర్త పరారీలో
ఉన్నాడు.
కాల్పులకు
పాల్పడిన ఇద్దరు దుండగులతో పాటు వారికి సహకరించిన ఓ వ్యక్తిని ఇప్పటికే పోలీసులు
అదుపులోకి తీసుకున్నారు. తాజాగా వారితో పాటు హత్యకు పరోక్షంగా సహకరించిన ఓ మహిళను
పోలీసులు అరెస్టు చేశారు. పోలీసు కస్టడీలో ఉన్న నిందితుల నుంచి లభించిన సమాచారం
ఆధారంగా ఈ అరెస్టు జరిగింది.
షూటర్లు
నితిన్ ఫౌజీ, రోహిత్ రాథోఢ్ తో పాటు వాళ్ళు పారిపోయేందుకు సహకరించిన ఉద్దమ్ సింగ్
ను పోలీసులు చంఢీగఢ్ లో శనివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టులో
ప్రవేశపెట్టగా వారం రోజుల పోలీస్ కస్టడీకి న్యాయమూర్తి అనుమతించారు.
జైపూర్
పోలీస్ కమిషనర్ బిజూ జార్జ్ జోసెఫ్ తెలిపిన వివరాల ప్రకారం, పూజా షైనీతో పాటు ఆమె
భర్త మహేంద్ర మేఘ్వాల్, నితిన్ ఫౌజీకి ఆయుధాలు సమకూర్చినట్లు పోలీసుల దర్యాప్తులో
తేలింది. మహేంద్ర మేఘ్వాల్ కు చెందిన ఫ్లాట్ లోనే నితిన్ ఫౌజీ డిసెంబర్ 5న అద్దెకు
దిగాడని, హత్య జరగడానికి వారం రోజుల ముందు నుంచే అతను అక్కడ నివాసం
ఉంటున్నాడన్నారు.
పూజా
షైనీని పోలీసులు అదుపులోకి తీసుకోగా ఆమె భర్త మహేంద్ర మేఘ్వాలే అలియాస్ సమీర్ పరారీలో
ఉన్నాడు.
హత్య
కుట్రలో భాగంగా నవంబర్ 28న జైపూర్ చేరుకున్న నితిన్ ఫౌజీ, మేఘ్ వాల్ ను కలిశారు. ఆ
తర్వాతి అతడికి చెందిన ఫ్లాట్ లో నివాసం ఉన్నాడు. వీరిద్దరూ కలిసి గ్యాంగ్ స్టర్
రోహిత్ గోడారతో మాట్లాడుతూ ఉండేవారని
అదనపు
పోలీసు కమిషనర్ కైలాశ్ చంద్ర బిష్ణోయ్ తెలిపారు.
మాఫియా డాన్ లారెన్స్ బిష్ణోయ్ తో గోడారకు సన్నిహిత
సంబంధాలున్నాయి. సుఖదేవ్ సింగ్ హత్యకు తామే కారణమని ఫేస్బుక్ వేదికగా గోడార
ప్రకటించారు. దాదాపు అర డజను పిస్టల్స్,
పెద్దమొత్తంలో కార్ట్రిడ్జ్ ను మేఘ్ వాల్ సేకరించగా
అందులో రెండింటిని నితిన్ ఫౌజీ తీసుకున్నాడు. నిందితులకు మేఘ్ వాల్ భార్య పూజా ఆహారం
అందజేసింది. వీరి నివాసం నుంచే ఓ ఏకే 47ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
వీరిద్దరూ బిష్ణోయ్ ముఠాకు ఆయుధాలు సరఫరా చేసిన్నట్లు పోలీసులు తెలిపారు.