THE
INTERCEPT STORY ON BHARAT: పశ్చిమ దేశాల్లో ఆశ్రయం పొందుతున్న కొన్ని సిక్కు సంస్థల కార్యకలాపాలకు
అడ్డుకట్టవేసేలా భారత ప్రభుత్వం రహస్యంగా ఉత్తర్వులు( SECRET MEMO) జారీ చేసిందని అమెరికాకు చెందిన ఆన్లైన్
మీడియా సంస్థ ‘ది ఇంటర్సెప్ట్’ ప్రచురించిన కథనంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
అమెరికాలోని
తమ రాయబార కార్యాలయాలకు భారత ప్రభుత్వం రహస్య ఉత్తర్వులు జారీ చేసిందని, అందులో హర్దీప్
సింగ్ నిజ్జర్ తో పాటు ఇతర ఖలిస్తా్థానీ ఉగ్రవాదుల పేర్లతో కూడిన జాబితా ఉందని ఇంటర్సెప్ట్
వెల్లడించింది.
విదేశాల్లోని
కొన్ని సిక్కు సంస్థల అధినేతలతో పాటు కెనడా పౌరుడైన హర్దీప్ సింగ్ నిజ్జర్ పేర్లు
కూడా భారత్ పంపిన రహస్య జాబితాలో ఉన్నాయని కథనంలో ఇంటర్ సెప్ట్ పేర్కొంది.
ఆ కథనాన్ని భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. విదేశీ వ్యవహారాల శాఖ అధికార
ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ఓ ప్రకటన విడుదల చేశారు. కల్పిత కథనాలు, అవాస్తవాలతో
కథనాలు ప్రచురించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్ కు వ్యతిరేకంగా
సాగుతున్న తప్పుడు ప్రచారంలో ఈ కుట్ర కూడా భాగమని మండిపడ్డారు.
పాకిస్తాన్
నిఘా సంస్థ ప్రోద్బలంతో నకిలీ వార్తలను ప్రచారం చేస్తున్న విషయం బహిరంగ రహస్యమేనని
దుయ్యబట్టారు.