గాజా దక్షిణ ప్రాంతంలో ఇజ్రాయెల్ సైన్యం దాడులు మరింత పెంచింది. కాల్పుల విరమణకు రాకుంటే బందీలు సజీవంగా ఉండరని హమాస్ హెచ్చరించినా ఇజ్రాయెల్ సైన్యం (israel hamas war) వెనక్కు తగ్గలేదు. దాడులు మరింత పెంచింది. సోమవారంనాడు వైమానిక దాడులతో బాంబుల వర్షం కురిపించింది. ఉత్తర గాజాలోని రెండు నగరాల్లో ప్రజల మధ్యే హమాస్, ఇజ్రాయెల్ భూతల దాడులు కొనసాగుతున్నాయి.
మా ఖైదీల విడుదల చేయకుండా, కాల్పుల విరమణపై చర్చలు జరపకుండా బందీలు సజీవంగా బయటకు వెళ్లరని హమాస్ తీవ్రవాదుల హెచ్చరికల తరవాత ఇజ్రాయెల్ సైన్యం దాడులు పెంచింది. ఇప్పటికీ 137 మంది బందీలు హమాస్ ఉగ్రవాదుల చెరలో ఉన్నారు. 7 వేల మంది పాలస్తీనియన్లు ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్నారు. దక్షిణ గాజాలోని
ఖాన్ యూనిస్ నగరంలో ఇజ్రాయెల్ భీకరదాడులు జరుపుతోంది. గాజా సిటీలోనూ సైన్యానికి, ఉగ్రవాదుల మధ్య పోరుసాగుతోంది. జబాలియా శరణార్ధి శిబిరాల చుట్టూ తుపాకీ కాల్పుల మోత మోగుతోంది.