మధ్యప్రదేశ్లో కట్నీ జిల్లాలో ఘోరం చోటు చేసుకుంది. ఆదివారం సాయంత్రం జబల్పుర్ రీవీ మెమె రైలు పాకరియా స్టేషన్ నుంచి కదలి, సత్నా కట్నీ మధ్యలో ఉండగా ఓ మహిళపై అత్యాచారం (crime news ) జరిగింది. కదులుతున్న రైలులో 30 ఏళ్ల మహిళపై జరిగిన అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటనపై బాధితురాలు సత్నా స్టేషన్లో రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందిగుడు పంకజ్ కుశ్వాహాను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
రైళ్లలో నేరాలను అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు ప్రారంభించింది. ప్రధాన స్టేషన్లలో రైల్వే పోలీస్ బలగాలను పెంచడంతోపాటు, ఇప్పటికే 24 గంటలూ సీసీ టీవీ ఫుటేజీ పరిశీలన చేస్తున్నారు. రైళ్లలో మహిళలు ఒంటిరిగా ప్రయాణం చేసేప్పుడు, ప్రయాణీకులు ఉండేలా చూసుకోవాలని రైల్వే శాఖ ప్రచారం కూడా నిర్వహిస్తోంది.