దేశీయ స్టాక్ మార్కెట్ (stock markets) సూచీలు సరికొత్త రికార్డు నమోదు చేశాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన స్టాక్ సూచీలు లాభాలతో ముగిశాయి. ఇవాళ ఉదయం 69925 పాయింట్ల వద్ద మొదలైన సెన్సెక్స్, ఒక దశలో 70057 పాయింట్లను దాటి జీవితకాల గరిష్ఠాన్ని నమోదు చేసింది. మార్కెట్ ముగిసే సమయానికి 102 పాయింట్ల లాభంతో 69928 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 27 పాయింట్లు పెరిగి 20997 వద్ద క్లోజైంది.
సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో అల్ట్రాటెక్ సిమెంట్స్, పవర్ గ్రిడ్, టాటా మోటార్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, హెచ్‌సీఎల్, ఐటీసీ, టాటా స్టీల్, నెస్టే ఇండియా కంపెనీల షేర్లు లాభాల్లో ముగిశాయి. యాక్సిస్ బ్యాంక్, ఎం అండ్ ఎం, మారుతీ, హెచ్ యూ ఎల్, బజాన్ ఫైనాన్స్, విప్రో, భారతీ ఎయిల్ టెల్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. స్పైస్ జెట్ సంస్థ ఎన్ఎస్ఈలో కూడా నమోదు చేసేందుకు సిద్దమవుతోంది. ప్రస్తుతం ఆ సంస్థ బీఎస్‌లో మాత్రమే లిస్టైంది.