జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక స్వయం ప్రతిపత్తి కల్పించిన అధికరణం 370 రద్దు అంశంపై సుప్రీంకోర్టు ఇవాళ కీలక తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. అధికరణం 370 రద్దు సబబేనంటూ సుప్రీం కోర్టు కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ తీర్పు వెలువరించడంపై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. ప్రజల ఆశలు, ఐక్యత, పురోగతిని ప్రతిధ్వనించే తీర్పుగా ప్రధాని (pm modi) కొనియాడారు.
అధికరణం 370పై సుప్రీంకోర్టు సోమవారం ప్రకటించిన తీర్పు చరిత్రాత్మకం. 2019 ఆగష్టు 5న పార్లమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని కొందరు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. దీనిపై సుదీర్ఘంగా విచారించిన సర్వోన్నత న్యాయస్థానం ఇవాళ తీర్పు వెలువరించింది. భారతీయులందరూ గర్వపడే ఐక్యతను కోర్టు మరోసారి బలపర్చిందని ప్రధాని అభిప్రాయపడ్డారు.
లద్దాఖ్ ప్రజల కలలను నెరవేర్చేందుకు మేం నిబద్దతతో ఉన్నాం. అధికరణం 370తో నష్టపోయిన వారందరికీ అభివృద్ధి ఫలాలందిస్తామని ప్రధాని మోదీ భరోసా ఇచ్చారు. ఇవాళ వెలువడిన తీర్పు చట్టబద్దమైనదే కాదు. రానున్న తరాలకు ఇదో ఆశాకిరణం అంటూ కొనియాడారు.