వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ycp mla resigned) రాజీనామా చేశారు. మంగళగిరి ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను స్పీకర్ కార్యదర్శికి అందించారు.గత కొంత కాలంగా ఆర్కే వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మంగళగిరి వైసీపీ ఇన్ఛార్జిగా గంజి చిరంజీవిని నియమించడంతో ఆళ్ల పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది.
మంగళగిరి వైసీపీలో గత కొంత కాలంగా వివాదాలు కొనసాగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆళ్ల రామకృష్ణారెడ్డికి టికెట్ ఇచ్చే అవకాశం లేదనే ప్రచారం సాగుతోంది. పలు సర్వేల్లో ఆర్కే మరలా గెలిచే అవకాశం లేదని తేలడంతో గంజి చిరంజీవిని రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. ఆర్కేను కాదని మంగళగిరి పార్టీ వ్యవహారాలు గంజి చిరంజీవికి అప్పగించడంతో వివాదాలు తారస్థాయికి చేరాయి.