జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తూ వచ్చిన రాజ్యాంగంలోని 370 ఆర్టికల్ రద్దుపై (370 ariticle) సుప్రీంకోర్టు ఇవాళ కీలక తీర్పు ఇవ్వనుంది. సుప్రీం తీర్పు రానున్న నేపథ్యంలో జేకేలో భద్రతను కట్టుదిట్టం చేశారు. కొందరిని అదుపులోకి తీసుకున్నారు. మరికొందరిని గృహనిర్భంధంలో ఉంచారు. రెండు వారాల నుంచి జేకేలో భద్రతను పెంచారు.
సుప్రీంతీర్పును ఎవరూ రాజకీయం చేయవద్దని అందరూ గౌరవించాలని బీజేపీ సూచించింది. 370పై ఎలాంటి తీర్పు వచ్చినా జమ్మూకశ్మీర్‌లో శాంతిభద్రతలను ఎలాంటి విఘాతం కలిగించమని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా ప్రకటించారు. అయితే న్యాయపరమైన పోరాటం కొనసాగిస్తామన్నారు.
2019 ఆగష్టు 5న కేంద్ర ప్రభుత్వం 370 అధికరణ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. జమ్మూ కశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అనేక పార్టీలు నిరసన తెలిపాయి. కేంద్ర నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశాయి. దీనిపై సుదీర్ఘంగా విచారించిన ధర్మాసనం ఇవాళ తీర్పు వెలువరించనుంది.