ఛత్తీస్‌గఢ్ సీఎంగా విష్ణుదేవ్ సాయ్‌ను (chhattisgarh chief minister) ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇవాళ సమావేశమైన బీజేపీ ఎమ్మెల్యేలు, శాసనసభా పక్షం నేతగా విష్ణుదేవ్ సాయ్‌ను ఎన్నుకున్నారు. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. విష్ణుదేవ్ గతంలో ఛత్తీస్‌గఢ్ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రధాని మోదీ క్యాబెనెట్లో కేంద్ర మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఉంది.
తాజాగా విడుదలైన ఎన్నికల ఫలితాల్లో ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ సంపూర్ణ మెజారిటీ సాధించింది. మొత్తం 90 సీట్లున్న అసెంబ్లీలో బీజేపీ 54 గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీకి 35 లభించాయి. బీజేపీ సంపూర్ణ మెజారిటీ సాధించడంతో సీఎం అభ్యర్థి ఎవరనే దానిపై గత వారం రోజులుగా సంప్రదింపులు జరుగుతున్నాయి. చివరకు విష్ణుదేవ్ సాయ్ అభ్యర్థిత్వాన్ని ఎక్కువ మంది బీజేపీ ఎమ్మెల్యేలు బలపరిచినట్లు తెలుస్తోంది.