రాజమహేంద్రవరం
ఎయిర్ పోర్టు కొత్త టెర్మినల్ కు కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సిందియా భూమి పూజు చేశారు.
2025 చివరినాటికి ప్రయాణీకులకు ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుందని ఆయన తెలిపారు.
కొత్త
టెర్మినల్ నిర్మాణం పూర్తికావడానికి కనీసం రెండేళ్ళ సమయం అవసరమని, 2025 చివరి
నాటికి పూర్తి అవుతుందని ఆశిద్దామని ఎయిర్ పోర్టు అథారిటీ చైర్మన్ సంజీవ్ కుమార్
వెల్లడించారు.
ప్రస్తుత
టెర్మినల్ 4 వేల చదరపు మీటర్లలో నిర్మించారు. కొత్త టెర్మినల్ నిర్మాణాలను 17 వేల చదరపు మీటర్లకు
విస్తరించినట్లు వివరించారు.
గంటకు
8 నుంచి 10 విమానాల రాకపోకలకు అనువుగా ఉండేలా కొత్త టెర్మినల్ నిర్మాణం జరుగుతుదని
2 వేల మంది ప్రయాణీకుల రద్దీకి సరిపోయేలా సదుపాయాలు అందుబాటులోకి వస్తాయన్నారు.
కొత్త
టెర్మినల్ అంచనా వ్యయం రూ. 350 కోట్లు కాగా,
30 చెక్ ఇన్ లు, మూడు ఏరో బ్రిడ్జిలు రానున్నాయి. ఒకేసారి 600 కార్లను నిలిపేలా
పార్కింగ్ ఏరియాను విస్తరిస్తున్నారని పౌర విమానాయాన మంత్రిత్వ శాఖ వివరించింది.
ప్రస్తుతం దక్షిణాదికి మాత్రమే పరిమితమైన
సర్వీసులు, భవిష్యత్తులో దేశవ్యాప్తంగా రాకపోకలు సాగించేలా ఎయిర్ పోర్టు అభివృద్ధి
జరుగుతుందన్నారు. మెట్రోపాలిటిన్ నగరాల్లో విమానాశ్రయాల్లో కల్పించే అన్ని అధునాతన
హంగులు ఇక్కడ అందుబాటులోకి రానున్నాయి.
రాజమండ్రి, దాని చుట్టుపక్కల పట్టణాల
ఆర్థికపురోగతిలో ఎయిర్ పోర్టు కీలకంగా మారబోతుందని పౌరవిమానయాన శాఖ తెలిపింది.