166 new Covid cases, mostly from Kerala: దేశవ్యాప్తంగా మళ్ళీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటం కలవరపెడుతోంది.
ఇవాళ ఒక్క రోజే దేశంలో 166 మందికి కోవిడ్ సోకినట్లు తాజా పరీక్షల్లో తేలింది.
దేశవ్యాప్తంగా ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య 895 కాగా అందులో సింహాభాగం కేరళది మరో
ఆందోళనకర అంశం.
రోజుకు
సగటున 100 కేసులు వెలుగులోకి వస్తున్నాయి. శీతాకాలం కావడంతో వైరస్ విజృంభిస్తోంది.
రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ ఏడాది జూలై 24న అతి తక్కువ కేసులు నమోదు
అయ్యాయి. ఇప్పటి వరకు ఈ రాకాసి వైరస్ బారిన పడిన బాధితుల సంఖ్య 4.44 కోట్లు కాగా 5,33,306 మంది కోవిడ్ సోకి మరణించారు.
ప్రస్తుతం
పాజిటివిటీ వ్యాప్తి రేటు 1.19 శాతంగా ఉంది.
ఇప్పటి
వరకు 220.67 కోట్ల
డోసుల కోవిడ్ వ్యాక్సిన్ వేసినట్లు
కేంద్రం వెల్లడించింది. వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు జలుబు
లక్షణాలు తలెత్తితే మాస్క్ వాడాలని వైద్యులు సూచిస్తున్నారు.